Ayatollah Ali Khamenei | ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బొల్లా (Hezbollah) అధినేత హస్సన్ నస్రల్లా (Hassan Nasrallah) హతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా తన సుప్రీమ్ లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)ని సురక్షిత ప్రాంతానికి (secure location) తరలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించినట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అదే సమయంలో నస్రల్లా హతం వేళ తదుపరి కార్యాచరణ విషయంలో హిజ్బొల్లా, ఇతర సంస్థలతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సరదు అధికారులు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
కాగా, హిజ్బొల్లా (Hezbollah)పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. నస్రల్లాను అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. బీరుట్ (Beirut)లో ఉన్న బిల్డింగ్‌లపై వైమానిక దాడులకు (airstrike) పాల్పడింది. ఆ సిటీలో ఉన్న హిజ్బొల్లా కమాండ్ సెంటర్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జరిగింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని భూగర్భంలో ఉన్న హిజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో హిజ్బొల్లా చీప్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం అధికారికంగా ధ్రువీకరించింది.
తాము చేసిన దాడుల్లో నజ్రల్లా మృతి చెందినట్లు వెల్లడించింది. ‘హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరు’ అంటూ ఐడీఎఫ్ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో హమాస్, హిజ్బొల్లాకు మొదటి నుంచి ఇరాన్ అన్ని విధాలా సపోర్ట్‌గా నిలుస్తోంది. ఇప్పటికే హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా (Ismail Haniyeh) హత్యకు గురైన విషయం లిసిందే. ఇప్పుడు హిజ్బొల్లా చీఫ్ హతం వేళ.. ఇరాన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
Also Read..
Hezbollah | తాజా దాడుల్లో హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతం.. ప్రకటించిన ఇజ్రాయెల్
Hassan Nasrallah: ఎవరీ హిజ్బొల్లా నేత హస్సన్ నస్రల్లా ? తాజా దాడుల్లో అతనికేమైంది ?