Hezbollah | హిజ్బొల్లా (Hezbollah)పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హిజ్బొల్లా అధినేత హస్సన్ నస్రల్లాను (Hassan Nasrallah) టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం అధికారికంగా ధ్రువీకరించింది. తాము చేసిన దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు వెల్లడించింది.
కాగా, నస్రల్లాను అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. బీరుట్ (Beirut)లో ఉన్న బిల్డింగ్‌లను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులకు (airstrike) పాల్పడింది. ఆ సిటీలో ఉన్న హిజ్బొల్లా కమాండ్ సెంటర్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జరిగింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని భూగర్భంలో ఉన్న హిజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది.
అండర్‌గ్రౌండ్ హెడ్‌క్వార్టర్స్‌లో దాక్కున్న నస్రల్లా ఆ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే, తాజా దాడుల్లో నస్రల్లాకు ఏమీ కాలేదని హిజ్బొల్లా వర్గం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తమ దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. ‘హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరు’ అంటూ ఐడీఎఫ్ ట్వీట్ చేసింది. మరోవైపు తాజా దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా (Zainab Nasrallah) మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమె మరణంపై హిజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులుగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
Also Read..
Hezbollah | బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. హిజ్బొల్లా చీఫ్ కుమార్తె మృతి..!
Hassan Nasrallah: ఎవరీ హిజ్బొల్లా నేత హస్సన్ నస్రల్లా ? తాజా దాడుల్లో అతనికేమైంది ?
Israel Hezbollah War | లెబనాన్ సరిహద్దుకు యుద్ధట్యాంకులు.. భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధం