Hezbollah | హిజ్బొల్లా (Hezbollah)పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హిజ్బొల్లా అధినేత హస్సన్ నస్రల్లాను (Hassan Nasrallah) టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయిల్ భీకర దాడులకు దిగింది. బీరుట్ (Beirut)లో ఉన్న బిల్డింగ్‌లను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులకు (airstrike) పాల్పడింది. ఆ సిటీలో ఉన్న హిజ్బొల్లా కమాండ్ సెంటర్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జరిగింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని భూగర్భంలో ఉన్న హిజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది.
ఈ దాడుల్లో హిజ్బొల్లా అధిపతి నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా (Zainab Nasrallah) మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమె మరణంపై హిజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులుగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. మరోవైపు తాజా దాడుల్లో హిజ్బొల్లా అధినేత హస్సన్ నస్రల్లా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే, తాజా దాడుల్లో నస్రల్లాకు ఏమీ కాలేదని హిజ్బొల్లా వర్గం వెల్లడించింది.
Also Read..
Hassan Nasrallah: ఎవరీ హిజ్బొల్లా నేత హస్సన్ నస్రల్లా ? తాజా దాడుల్లో అతనికేమైంది ?
Hurricane Helene | అమెరికాలో హెలెనా విధ్వంసం.. 44 మంది మృతి