Israel-Iran War | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను తీవ్రతరం చేశాయి. అదే సమయంలో ఇరాన్‌సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ప్రధాన ఆస్పత్రి ధ్వంసమైంది. బీర్షెబాలోని వెయ్యి పడకల సోరోకా ఆస్పత్రి ఆ దాడిలో దెబ్బతిన్నది. ఇరాన్ జరిపిన ఈ దాడిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఇక ఉనికిలో ఉండటానికి వీల్లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israel Katz) వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తానన్న ఖమేనీ వంటి నియంత ఇక ఉండకూడదన్నారు. ఐడీఎఫ్ దళాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ‘పిరికి ఇరాన్ నియంత సురక్షితమైన బంకర్లో దాక్కొని ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు, నివాస భవనాలపై క్షిపణులను ప్రయోగిస్తున్నారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం. దీనికి ఖమేనీ పూర్తి బాధ్యత వహించాల్సిందే. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖమేనీ ఇక ఉనికిలో ఉండటానికి వీల్లేదు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకు, అయతొల్లా పాలనను అణగదొక్కడానికి ఇరాన్‌లోని వ్యూహాత్మక, ప్రభుత్వ లక్ష్యాలపై దాడులను పెంచాలని ప్రధాన మంత్రి, నేను ఐడీఎఫ్‌ను ఆదేశించాము’ అని రక్షణ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Also Read..
Iranian Missile: ఇరాన్ మిస్సైల్ దాడిలో.. ఇజ్రాయిలీ ఆస్పత్రి ధ్వంసం
Donald Trump | ఇరాన్‌పై దాడికి సిద్ధమైన అమెరికా.. ప్రైవేట్‌గా ట్రంప్ గ్రీన్ సిగ్నల్..!