Visa Free | భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఇరాన్.. ఇకపై వీసా అవసరమే లేదంట!
Visa Free | భారతీయులకు గుడ్‌న్యూస్. ఇకపై ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు మరో 32 దేశాలకు పర్యాటకులు కూడా వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది.
Visa Free | భారతీయులకు గుడ్‌న్యూస్. ఇకపై ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు మరో 32 దేశాలకు పర్యాటకులు కూడా వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది. ఇప్పటికే తుర్కియే, రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్, ఒమన్, చైనా, ఆర్మేనియా, లెబనాన్, సిరియా దేశాలకు వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. తాజాగా మరో 33 దేశాలకు కూడా మినహాయింపు ఇవ్వడంతో ఆ సంఖ్య 45కు చేరింది.
ప్రస్తుతం భారత్ నుంచి దౌత్య వ్యవహారాల కోసం ఇరాన్ వెళ్లే వారికి మాత్రమే వీసా మినహాయింపు ఉండేది. కానీ తాజా నిర్ణయంతో పర్యాటకులు కూడా వీసా లేకుండానే ఇరాన్లో పర్యటించవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ పర్యాటక శాఖ మంత్రి ఎజ్జటొల్లా జర్ఘామీ వెల్లడించారు. దీనివల్ల తమ దేశంలోని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి ఇరాన్ ప్రభుత్వం ఇస్తున్న వీసా నిబంధనల సడలింపు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐర్నా (IRNA) వెల్లడించింది. ఇరానియన్ సంవత్సరం మొదలైనప్పటి నుంచి 8 నెలల కాలంలో 44 లక్షల మంది పర్యాటకులు తమ దేశంలో పర్యటించారని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 48.5 శాతం ఎక్కువ కావడం విశేషం.
ఇరాన్ నుంచి వీసా మినహాయింపు పొందిన దేశాలివే..
రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, తునీసియా, మారిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్, సీషెల్స్, ఇండోనేసియా, బ్రునెయి, జపాన్, సింగపూర్, కాంబోడియా, మలేసియా, వియాత్నం, బ్రెజిల్, పెరూ, క్యూబా, మెక్సికో, వెనిజులా, బోస్నియా, హెర్జెగోవినా, సెర్బియా, క్రోషియా, బెలారస్
ఇక భారత్ విషయానికొస్తే.. కెన్యా, ఇండోనేసియా, మలేసియా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, హైతీ, మాల్దీవ్స్, మారిషస్ సహా 27 దేశాల్లో భారతీయులు వీసా లేకుండానే పర్యటించవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- India
- International news
- iran
- visa
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

