వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అటాక్ చేసిన తర్వాత.. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి చేసిన విషయం తెలిసిందే. అయితే చైనాకు చెందిన నిఘా శాటిలైట్(Chinese Spy Satellite) సమాచారాన్ని రహస్యంగా ఇరాన్ వాడినట్లు తెలిసింది. అమెరికా మిలిటరీ బేస్‌లపై ఇరాన్ దాడి చేయడానికి చైనా శాటిలైట్ డేటా ఉపయోగపడినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నా.. ఇరాన్ మాత్రం గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఈజీగా టార్గెట్ చేసింది. దీని కోసం టీఈఈ-01బీ శాటిలైట్‌ను ఇరాన్ వాడింది.
చైనీస్ ఎర్త్ ఐ కంపెనీ ఆ ఉపగ్రహాన్ని నిర్మించింది. ఆ కంపెనీయే ఆ శాటిలైట్‌ను లాంచ్ చేసింది. అయితే ఆ శాటిలైట్‌ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏరోస్పేస్ 2024లో సొంతం చేసుకున్నది. ఇరానీ మిలిటరీ డాక్యుమెంట్ల ద్వారా ఈ అంశం లీకైనట్లు తెలుస్తోంది. అమెరికా మిలిటరీ సైట్లను మానిటర్ చేయాలని ఇరానీ మిలిటరీ కమాండర్లు ఆ శాటిలైట్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక తన కథనంలో రాసింది. డ్రోన్, మిస్సైల్ దాడులకు చెందిన ఇమేజ్‌లను కూడా అమెరికా పరిశీలించింది. ఇరాన్ తన షాహిద్ డ్రోన్లతో అమెరికా స్థావరాలను ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే.