Iran Supreme Leader | ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్ (Israel) ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున ఇరాన్ క్షిపణి కేంద్రాలు, డ్రోన్ల తయారీ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా వందకుపైగా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆ దేశ మిసైల్స్‌లో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తున్నది. ఈ దాడులతో టెహ్రాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
ఇక ఈదాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei ) చేసిన వివాదాస్పద ట్వీట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన ట్వీట్ చేసిన ఖాతాను ‘ఎక్స్’ సస్పెండ్ చేసింది (X Account Suspended). ఇజ్రాయెల్ జరిపిన దాడులపై అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ.. సామాజిక మాధ్యమం ద్వారా ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ పోస్టు పెట్టారు. ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు.
జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ‘రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్టపాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం’ అని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాడటంతో ఆ ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది.
Also Read..
Gaganyaan Mission | 2025లో కాదు.. గగన్‌యాన్ మిషన్‌పై ఇస్రో కీలక అప్డేట్
Iran | ఇజ్రాయెల్ వాయుసేన దాడులు.. ఇరాన్‌కు భారీ దెబ్బే
Israel’s attack on Iran | ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలి: సుప్రీం లీడర్ ఖమేనీ