Iran | తమ అణుకేంద్రాలపై అగ్రరాజ్యం అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ (Iran) ప్రతీకార దాడులకు దిగింది. ఖతార్ (Qatar)లోని అమెరికా వైమానిక స్థావరం అల్-ఉదీద్పై (US Al-Udeid base) క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇరాన్ సాయుధ దళాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ‘ఇరాన్ భూభాగంపై జరిగే ఎలాంటి దాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం ఇవ్వకుండా ఉండం’ అని పేర్కొన్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి అమెరికా ఉపయోగించిన బాంబుల సంఖ్యనే తమ సాయుధ దళాలు ఉపయోగించినట్లు ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థ తెలిపింది. అయితే, ఇరాన్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ అధికారులు తెలిపారు.
ఈ మేరకు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ గగనతలం, భూభాగం సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. తమ పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించింది. పౌరులు, నివాసితులు కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని, సూచనలను మాత్రమే పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఖతార్ ప్రకటించింది. మరోవైపు ఖతార్‌పై ఇరాన్ దాడులను సౌదీ తీవ్రంగా ఖండించింది.
Also Read..
Israel-Iran | ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించిన ఇరాన్.. పలువురు మృతి
Iran | ఇజ్రాయెల్ ఆపితే మేమూ ఆపుతాం.. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించిన ఇరాన్
Israel Iran War | ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందన్న ట్రంప్.. ఖండించిన టెహ్రాన్