Abbas Araghchi : తమ దేశంపై దాడులకు దిగుతున్న అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశాన్ని కాపాడుకునేందుకు 1000 శాతం సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఒకవైపు శాంతి ప్రక్రియ జరుగుతుండగా, ఇంకోవైపు అమెరికా సైనిక చర్య సరికాదని ఇరాన్ అభిప్రాయపడింది.
ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలు జరుగుతున్న ప్రతిసారీ అమెరికా సైనిక చర్యకు దిగుతోందని విమర్శించారు. ‘‘ద్వైపాక్షిక పరిష్కారం అందుబాటులో ఉన్నప్పటికీ అమెరికా మాత్రం ప్రతిసారీ నిర్లక్ష్యంగా సైనిక చర్యకు దిగుతోంది. ఇదేమైనా బెదిరించే వ్యూహమా..? లేదా ఇతరుల ఒత్తిడి వల్ల యుద్ధంలోకి చేరిన అమెరికా అధ్యక్షుడి పరిస్థితికి ఫలితమా..? కారణం ఏదైనా ఇరాన్ మాత్రం ఎవరికీ, ఎలాంటి ఒత్తిడికీ తలవంచదు” అని వెల్లడించారు. మరోవైపు ఇరాన్ సైనిక సామర్ధ్యం, మిస్సైల్స్ నిల్వలు భారీ స్థాయిలో తగ్గిపోయాయని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం సీఐఏ ఇచ్చిన నివేదిక తప్పని అబ్బాస్ అన్నారు.
Every time a diplomatic solution is on the table, the U.S. opts for a reckless military adventure. Is it a crude pressure tactic? Or the result of a spoiler once again duping POTUS into another quagmire?
Whatever the causes, outcome is the same: Iranians never bow to pressure. pic.twitter.com/ev7dMIebNB
— Seyed Abbas Araghchi (@araghchi) May 8, 2026
ఆ ప్రచారంలో నిజం లేదని తెలిపారు. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తి సిద్ధంగా ఉందని తెలిపారు. తమ ప్రజల్ని రక్షించుకునేందుకు ఇరాన్ ఎలాంటి సైనిక చర్యకైనా1000 శాతం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇరాన్‌లోకి క్షిపణి వ్యవస్థ, నిర్మాణాల్ని ధ్వంసం చేశామంటూ అమెరికా చెప్పుకొంటున్న ప్రచారంలో నిజం లేదని వివరించారు.