Flight | నిద్రలో పైలట్లు.. విచారణకు ఆదేశించిన ఇండోనేషియా..!
Flight | విమాన ప్రయాణంలో ఇద్దరు పైలట్లు ఒకేసారి నిద్ర పోయిన ఘటనపై ఇండోనేషియా రవాణాశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇద్దరు పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసి, విచారణకు ఆదేశించింది.
Flight | ఇండోనేషియాలో ఒక విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఒకే టైంలో ఇద్దరు ప్రయాణికులు నిద్ర పోవడంతో ఆ విమానం దారి తప్పింది. దాదాపు 30 నిమిషాల తర్వాత ప్రధాన పైలట్ మేల్కొని వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇండోనేషియా రవాణాశాఖ సదరు పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసింది. గత జనవరి 25న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది.
బాతిక్ ఎయిర్వేస్ సంస్థ విమానం నలుగురు సిబ్బంది, 153 మంది ప్రయాణికులతో సులవేసి నుంచి దేశ రాజధాని జకార్తాకు ప్రయాణమైన కొద్ది సేపటికే కో పైలట్ అనుమతితో ప్రధాన పైలట్.. అటుపై కో పైలట్ నిద్రలోకి జారుకున్నారు. వారిని సంప్రదించేందుకు జకార్తలోని ఎయిర్ కంట్రోల్ సెంటర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దాదాపు 28 నిమిషాల తర్వాత మేల్కొన్న ప్రధాన పైలట్.. తన కో పైలట్ కూడా నిద్ర పోతున్నాడని గమనించాడు. తమ విమానం నిర్ణీత మార్గంలో వెళ్లడం లేదని గుర్తించి.. కో పైలట్ ను నిద్ర లేపాడు. వెంటనే ఎయిర్ కంట్రోల్ కాల్ సెంటర్ ను సంప్రదించి విమానాన్ని సరైన మార్గంలోకి తీసుకుని జకార్తాలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

