ఇండోనేషియా నిర్ణయం
జకార్తా: పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు ఇండోనేషియా ప్రకటించింది. సోమవారం నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయని అధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు. స్థానికంగా ఉత్పత్తితగ్గడం, డిమాండ్ పెరగడంతో నెల రోజుల కింద ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది.
ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్‌ను ఎగుమతి చేసే ఇండోనేషియా నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అన్నిదేశాల్లో పామాయిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం నిషేధం ఎత్తివేయనుండటంతో వంట నూనెల ధరలు దిగివచ్చే అవకాశం ఉంది.