జకార్తా: 16 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని ఇండోనేషియా శనివారం అమల్లోకి తెచ్చింది. ఈ తరహా నిషేధం విధించిన తొలి ఆగ్నేయాసియా దేశంగా నిలిచింది. అన్ని సామాజిక మాధ్యమ కంపెనీలు చట్ట నిబంధనలు పూర్తిగా అమలు చేసే వరకు పర్యవేక్షిస్తామని ఇండోనేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ చట్టం అమలుపై ఇండోనేషియా పిల్లల్లో మిశ్రమ స్పందన వ్యక్తం కాగా.. తల్లిదండ్రులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.