Corruption | బెర్లిన్, ఫిబ్రవరి 11: దేశంలో అవినీతి ఏటా పెరుగుతున్నది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన వార్షిక కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ)-2024 నివేదికలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది. 2023లో 93వ ర్యాంకులో ఉండగా, 2024లో 96కి పడిపోయింది.
180 దేశాలకు ప్రతియేటా స్కోర్, ర్యాంకులను ఇస్తారు. 100 పాయింట్లకు గానూ ఇచ్చే స్కోర్లో తక్కువ పాయింట్లు సాధించిన దేశాల్లో ఎక్కువ అవినీతి ఉన్నట్టు, ఎక్కువ పాయింట్లు సాధించిన దేశాల్లో తక్కువ అవినీతి ఉన్నట్టు లెక్క.