దుబాయ్, నవంబర్ 24: పేరు లేదా ఇంటిపేరు ఇందులో ఏదో ఒకటి మాత్రమే పాస్‌పోర్టుపై ఉంటే ఇకనుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లడం కుదరదు. టూరిస్టు, ఆన్ అరైవల్ వీసాపై వచ్చేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ‘పాస్‌పోర్టుపై పేరు, ఇంటిపేరులో ఏదో ఒకటి మాత్రమే ఉండేలా ఇకనుంచి వీసాలు జారీచేయడం కుదరదు.
ఇదివరకు జారీచేసిన వీసాలు కూడా రద్దవుతాయి’ అని యూఏఈ కొత్త నిబంధనలు తెచ్చింది. అలాంటి పేర్లున్న పాస్‌పోర్టులు పట్టుకొని యూఏఈకి వెళ్తే విమానాశ్రయం నుంచే వెనుకకు పంపిస్తారు. ఈ నెల 21 నుంచి అవి అమలులోకి వచ్చినట్టు పేర్కొన్నది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తదితర విమానయాన సంస్థలు ఈ సంగతిని సర్క్యులర్‌లో వెల్లడించాయి.