Deportees | న్యూఢిల్లీ: అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియలో భాగంగా 300 మందిని పనామా దేశానికి అమెరికా పంపించింది. వీరిలో భారత్ సహా పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు. అక్రమ వలసదారులను పనామాలోని ఒక హోటల్లో నిర్బంధించారు.
కాగా, తమకు సాయం చేయాలని కోరుతూ హోటల్ గది నుంచి ప్లకార్డుల ద్వారా వీరు బయటి వారిని కోరుతున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది సొంత దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. కాగా, భారతీయ అక్రమ వలసదారులను అమెరికా నుంచి ప్రైవేటు విమానాల్లో రప్పించేందుకు విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతున్నది.