లండన్, డిసెంబర్ 6: ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి కొత్త చైర్మన్‌గా బ్రిటన్ ప్రభుత్వం బుధవారం భారత మూలాలున్న సమీర్ షాను ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో బీబీసీ హెడ్‌గా తప్పుకొన్న రిచర్డ్ షార్ప్ స్థానాన్ని సమీర్ షా భర్తీ చేయనున్నారు. సమీర్ షా నియామకాన్ని పార్లమెంట్ కమిటీ ఆమోదించింది. సమీర్ 40 ఏండ్లుగా టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. బీబీసీలో కరెంట్ ఎఫైర్స్ హెడ్‌తో పాటు పలు బాధ్యతలు నిర్వర్తించారు.