Vivek Taneja: వాషింగ్టన్లో భారతీయుడిపై అటాక్.. మృతిచెందిన 41 ఏళ్ల వివేక్ తనేజ
Vivek Taneja: 41 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్ తనేజ మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి రెండో తేదీన అతనిపై వాషింగ్టన్లో దాడి జరిగింది. దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. అటాకర్ ఆచూకీ చెప్పిన వారికి 25 వేల డాలర్లు రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
వాషింగ్టన్: 41 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్ తనేజ(Vivek Taneja) మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి రెండో తేదీన అతనిపై వాషింగ్టన్లో దాడి జరిగింది. ఓ వ్యక్తి అతన్ని తీవ్రంగా కొట్టాడు. అతని తల పేవ్మెంట్ను ఢీకొనడంతో రక్తస్త్రావం జరిగింది. ఆ రోజున ఓ రెస్టారెంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రాత్రి రెండు గంటలకు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ నెట్టేసుకున్నారు. అయితే గొడవ పెద్దగ కావడంతో అతనిపై అటాక్ జరిగింది. వివేక్ తనేజ ఆ అటాక్లో స్పృహ కోల్పోయాడు. చికిత్స పొందుతూ బుధవారం అతను చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు జరుగుతున్నట్లు చెప్పారు. ఆ వ్యక్తిని ఇంకా గుర్తించలేదన్నారు. అటాకర్ ఆచూకీ చెప్పిన వారికి 25 వేల డాలర్లు రివార్డు ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన సయ్యిద్ మజహిర్ అలీ అనే వ్యక్తిని చికాగోలు అటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న అయిదుగురు భారతీయ విద్యార్థులు వివిధ రకాల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

