న్యూఢిల్లీ : కెనడాలోని ఒట్టావా సమీపంలో ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను ఓ వ్యక్తి రాక్లాండ్ ప్రాంతంలో కత్తితో పొడిచి, హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుని కుటుంబానికి స్థానిక సంఘం సహకారంతో సహాయపడుతున్నట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది. ఈ ప్రాంతంలో భద్రత పెంచినట్టు ఒంటారియో ప్రొ విన్షియల్ పోలీసులు తెలిపారు.