న్యూఢిల్లీ/కీవ్, మే 13: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఇండియన్ ఎంబసీ తన కార్యకలాపాలను ఈనెల 17 నుంచి తిరిగి ప్రారంభించనున్నదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొన్నది.
యుద్ధం నేపథ్యంలో భారత ఎంబసీ మార్చి 13 నుంచి పోలాండ్ నుంచి పనిచేస్తున్నది. కీవ్‌లోని కార్యాలయాలను తిరిగి తెరవాలని పలు పశ్చిమ దేశాలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత్ కూడా ఈ నిర్ణయం తీసుకొన్నది.