గురువారం 09 జూలై 2020
International - Jun 27, 2020 , 01:25:40

మీ చర్యలకు తీవ్ర పరిణామాలు

మీ చర్యలకు తీవ్ర పరిణామాలు

  • భారత్‌తో ఎలా ఉంటారో తేల్చుకోండి.. 
  • చైనాకు భారత రాయబారి స్పష్టీకరణ 

బీజింగ్‌, జూన్‌ 26: తూర్పు లడఖ్‌లోని సరిహద్దుల్లో బలప్రయోగం ద్వారా యథాతథ స్థితిని మార్చాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనాను భారత్‌ హెచ్చరించింది. చైనా చర్యలతో ఈ ప్రాంతంలో శాంతికే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలకు నష్టం వాటిల్లుతుందని చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిస్రి శుక్రవారం స్పష్టంచేశారు. భారత్‌తో సంబంధాలు ఎలా ఉండాలో చైనాయే తేల్చుకోవాలని సూచించారు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలపై భారత్‌ స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. సరిహద్దుల్లో భారత బలగాల తనిఖీలను అడ్డుకోవటాన్ని ఆపాలని హెచ్చరించారు. గల్వాన్‌ లోయపై చైనా సార్వభౌమత్వం ప్రకటించుకోవటాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి ప్రకటనలు పరిస్థితిని మరింత జఠిలం చేస్తాయని అన్నారు. గల్వాన్‌ లోయలో ఎన్నో ఏండ్లుగా భారత బలగాలు గస్తీ తిరుగుతున్నాయని గుర్తుచేశారు. వాస్తవాధీన రేఖపై భారత్‌ సంపూర్ణ అవగాహనతో ఉన్నదని పేర్కొన్నారు.
logo