Ruchira Kamboj: పాక్ వ్యాఖ్యలపై స్పందించడం దండగ: యూఎన్‌లో ఇండియా
Ruchira Kamboj: జమ్మూకశ్మీర్‌పై పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలను రుచిర కాంబోజ్ ఖండించారు. ఆ దేశం చేసిన వ్యాఖ్యలపై స్పందించడమే దండగ అన్నారు. భుట్టో వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆమె అన్నారు.
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(Security Council)లో జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి( Bilawal Bhutto Zardari) చేసిన వ్యాఖ్యలను ఇండియా ఖండించింది. ఆ వ్యాఖ్యలు విలువలేనివని, మలినమైన, తప్పుడు ప్రచారం పట్ల స్పందించడం కూడా వ్యర్థమని ఇండియా పేర్కొన్నది. యూఎన్‌లోని భారత అంబాసిడర్ రుచిర కాంబోజ్(Ruchira Kamboj) ఈ అంశంపై స్పందిస్తూ.. పాక్ మంత్రి ఇచ్చిన ప్రకటనను తప్పుపట్టారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ ప్రతీకారేచ్ఛతో ఆ వ్యాఖ్యలు చేసినట్లు కాంబోజ్ ఆరోపించారు.
మహిళలు, శాంతి, భద్రత అంశంపై యూఎన్(United Nations) భద్రతా మండలి సమావేశంలో కాంబోజ్ మాట్లాడుతూ.. పాక్ చేసిన ఆరోపణలపై స్పందించడం నిరర్ధకమని తమ బృందం భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పాజిటివ్, ఫార్వడ్ అంశాలపై తాము ఫోకస్ పెట్టామని, ఇలాంటి ఎజెండాను బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, చర్చ కోసం ఎన్నుకున్న టాపిక్ పట్ల గౌరవం ఉందని, దాని ప్రాముఖ్యత తమకు తెలుసు అని, మా ఫోకస్ ఆ టాపిక్‌పైనే ఉంటుందని ఆమె అన్నారు.
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)తో పాటు లడాఖ్‌లోని అన్ని ప్రాంతాలు భారత భూభాగానికి చెందినవే అని గతంలో పలు మార్లు యూఎన్ వేదికగా ఇండియా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

