World Happiness Report | న్యూఢిల్లీ: ప్రజా జీవనం సంతోషకరంగా సాగుతున్న దేశాల జాబితాలో భారత దేశం అట్టడుగున ఉన్నది. 147 దేశాల పరిస్థితులను అధ్యయనం చేసి, గురువారం విడుదల చేసిన ఈ నివేదికలో భారత్ 118వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌ల్యాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ దేశం వరుసగా ఎనిమిదేండ్ల నుంచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంటున్నది.
రెండు, మూడు స్థానాల్లో వరుసగా డెన్మార్క్, ఐస్‌ల్యాండ్ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో స్వీడన్ (4), నెదర్లాండ్స్ (5) ఉన్నాయి. విశ్వాసం, ఆత్మ సంతృప్తి, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను పరిశీలించి ఈ ఆయా దేశాలకు ర్యాంకులిచ్చారు. ఏటా మార్చి 20న ప్రపంచ సంతోష దినాన్ని నిర్వహించాలని ఐక్య రాజ్య సమితి 2012లో ప్రకటించింది.