కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని 75 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్రమోదీ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కుందూజ్ ఎయిర్‌పోర్టులో ఎంఐ-35 హెలికాప్టర్‌ను వశపర్చుకున్నారు. రెండేండ్ల క్రితం (2019 అక్టోబర్‌లో) ఆఫ్ఘన్ సైన్యానికి భారత్ ఈ హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చింది. తాలిబన్లపై పోరుకు ఆఫ్ఘన్ సైన్యం దీన్ని వాడుతున్నది. ఇప్పుడా హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఒక వీడియో వైరల్ అవుతున్నది.
అయితే, హెలికాప్టర్‌కు సంబంధించిన రోటర్ బ్లేడ్లు, కీలక విడిభాగాలు కనపించకపోవటం గమనార్హం. తాలిబన్లు ఈ హెలికాప్టర్‌ను వాడకుండా ఉండేందుకే ముందుజాగ్రత్తగా ఆఫ్ఘన్ సైన్యం వాటిని తొలగించినట్టు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా, తాలిబన్ల దాడిని తట్టుకోలేక వందలాది ఆఫ్ఘన్ సైనికులు, పోలీస్ అధికారులు లొంగిపోతున్నారు. అటు.. తమ దేశాన్ని కాపాడాలంటూ ఆ దేశ క్రికెట్ ప్లేయర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ప్రపంచ దేశాలకు విన్నవించారు. పిల్లలు, మహిళలే కాకుండా వేలాది మంది అమాయకులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Location at Kunduz confirmed (36.66575, 68.91244)
— Joseph Dempsey (@JosephHDempsey) August 11, 2021
14 July @planet satellite image (below) shows Mi-35 with rotor blades attached.
10 August @Maxar image confirms Mi-35 still in place yesterday but rotor blades removed – possibly to further disable it from future use. pic.twitter.com/GLaUAiQ8e2