తమ మిత్రదేశాలు కానీ దేశాలన్నీ రష్యా నుంచి ఏమైనా కొనుగోలు చేస్తే కచ్చితంగా రష్యా రూబెల్స్లోనే చెల్లించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అతేకాదు ఈ క్రమంలోనే రష్యాకు 2.5 మిలియన్ అమెరికా డాలర్లు భారత్ చెల్లించాల్సింది.
ఈ నేపథ్యంలోనే రష్యాకు చెందిన చమురు సంస్థ గాజ్ప్రామ్కు భారత చమురు సంస్థ గెయిల్ నుంచి బకాయిలు అందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పేమెంట్ కరెన్సీ గురించి తమకు యూఎస్ డాలర్లలోనే పేమెంట్ జరుగుతోందని అధికారులు తెలిపారు.