public sector banks | ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. మూడు రోజుల సమ్మె నేపథ్యంలో నిర్ణయం
public sector banks : వచ్చే ఆదివారం, సెప్టెంబర్ 27న దేశంలోని బ్యాంకులు పనిచేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులు ఆదివారం కూడా పని చేస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
public sector banks : వచ్చే ఆదివారం, సెప్టెంబర్ 27న దేశంలోని బ్యాంకులు పనిచేయనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులు ఆదివారం కూడా పని చేస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 28-30 వరకు మూడు రోజులపాటు బ్యాంకు సిబ్బంది సమ్మె చేయబోతున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్బీయూ) ప్రకటించిన సంగతి తెలిసిందే.
వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులు పని చేయకపోవడం వల్ల వినియోగదారులకు ఇబ్బంది కలుగుతుందని, అందువల్ల ఆదివారం సెలవు రోజైనప్పటికీ బ్యాంకులు పనిచేసేలా నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ప్రజల బ్యాంకింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బ్యాంకులు, ఏటీఎంలు సెప్టెంబర్ 27 వరకు పూర్తిస్థాయిలో పని చేయాలని ఇటీవల ఆర్బీఐ ఆదేశించింది. ఈ నెల 26 నాలుగో శనివారం బ్యాంకులు పని చేయవు. అలాగే, 27వ తేదీ ఆదివారం సెలవు. ఆ తర్వాత 28, 29, 30.. ఇలా మూడు రోజులు సమ్మె.
దీంతో వరుసగా ఐదు రోజులు సెలవులు రావడం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడతారు. అందుకే..సెప్టెంబర్ 27, ఆదివారం బ్యాంకులు పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ఆర్బీఐ కూడా ఆమోదం తెలిపింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మాత్రమే ఆదివారం పని చేస్తాయి. సమ్మె వల్ల కలిగే ఇబ్బందుల గురించి వివిధ బ్యాంకులు ముందుగానే వినియోగదారులకు సమాచారం అందిస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ సమ్మెకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

