బీజింగ్: సరిహద్దుల్లో చైనా మరోసారి ఉద్రిక్తతలు రాజేస్తున్నది. ఏకపక్షంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన డ్రాగన్ దేశం.. తన చర్యను సమర్థించుకొన్నది. ఆ రీజియన్‌పై తమకు సార్వభౌమాధికారం ఉన్నదని చైనా ప్రకటించుకొన్నది. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ జాంగ్నన్(అరుణాచల్) చైనా భూభాగంలో భాగమని అన్నారు. స్టేట్ కౌన్సిల్ భౌగోళిక పేర్ల నిర్వహణ విభాగం నిబంధనలకు అనుగుణంగానే జాంగ్‌నన్‌లోని పలు ప్రాంతాల పేర్లను ప్రామాణికం చేసినట్టు తెలిపారు. చైనా సార్వభౌమ హక్కుల పరిధిలోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నది.