One Belt One Road | ఇస్లామాబాద్, అక్టోబర్ 16: చైనా చేపట్టిన వివాదాస్పద ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ ప్రాజెక్ట్‌పై భారత్ మరోసారి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. వాణిజ్య మార్గాలుగా పైకి చెబుతున్నా, ప్రాజెక్ట్ చేపడుతున్న ప్రాంతాలపై వ్యూహాత్మకంగా నియంత్రణ సాధించటం చైనా ఉద్దేశమని భారత్ అభిప్రాయపడింది. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీవో) సదస్సు ముగింపు సందర్భంగా బుధవారం ఉమ్మడి ప్రకటన విడుదలైంది. వన్ బెల్ట్ వన్ రోడ్‌కు భారత్ మినహా మిగతా సభ్య దేశాలన్నీ అంగీకరించినట్టు ఉమ్మడి ప్రకటన పేర్కొన్నది.
బీరుట్: ఇజ్రాయెల్ వైమానిక దాడులు లెబనాన్ అంతటా విస్తరించాయి. బుధవారం పలు పట్టణాలపై జరిగిన బాంబు దాడుల్లో కనీసం 25 మంది చనిపోయారని లెబనాన్ అధికారులు మీడియాకు తెలిపారు. కానా, నబతేయీ పట్టణాల్లో పలు భవనాలు, అపార్ట్మెంట్స్పై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఒక్క కానా పట్టణంలోనే 15 మంది చనిపోయారు. నబతేయీలో ఆరుగురు చనిపోగా, మృతుల్లో సిటీ మేయర్ ఉన్నాడని లెబనాన్ అధికారులు తెలిపారు.