న్యూఢిల్లీ: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25 శాతం అదనపు జరిమానా సుంకాలు చెల్లిస్తున్న భారత్ తాము ఇరాన్, వెనిజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని అమెరికాను కోరింది. ఈ వారంలో అమెరికాను సందర్శించిన భారతీయ అధికారులు చమురు దిగుమతులపై తమ వైఖరిని ట్రంప్ ప్రభుత్వం ముందు పునరుద్ఘాటించినట్లు బ్లూమ్బర్గ్ వార్తాకథనం పేర్కొంది.
ప్రస్తుతం ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, వెనిజువెలా నుంచి చమురు దిగుమతులకు అనుమతిస్తే రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకోగలమని భారత అధికారులు అమెరికాకు స్పష్టం చేసినట్లు వార్తా కథనం తెలిపింది.