న్యూఢిల్లీ: ట్రాన్సిట్ హాల్ట్ సందర్భంగా తన భారతీయ పాస్‌పోర్టును గుర్తించడానికి నిరాకరించిన చైనా ఇమిగ్రేషన్ అధికారులు షాంఘై విమానాశ్రయంలో తనను 18 గంటలపాటు బంధించి తీవ్ర వేధింపులకు గురి చేశారని అరుణాచల్ ప్రదేశ్ మహిళ థోంగ్దోక్ ఆరోపించారు. ఈ నెల 21న లండన్ నుంచి జపాన్ ప్రయాణిస్తూ మూడు గంటల పాటు షాంఘై ఎయిర్‌పోర్టులో లే ఓవర్ నిమిత్తం ఆమె ఆగారు.
పాస్‌పోర్టులో తన పుట్టిన ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అని ఉన్న కారణంగా తన పాస్‌పోర్టు చెల్లదని ఇమిగ్రేషన్ కౌంటర్ అధికారులు ప్రకటించారని ఆమె ఆరోపించారు. ఈ వేధింపులపై తాను ప్రధాని మోదీకి లేఖ రాశానన్నారు.