బెర్లిన్, మే 2: ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జర్మనీ చేరుకొన్నారు. బెర్లిన్‌లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్స్‌తో మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అడవుల పునరుద్ధరణ, పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించి సంయుక్త డిక్లరేషన్‌పై ఇరువురు సంతకాలు చేశారు. ఇంకా డెన్మార్క్, ఫ్రాన్స్‌లో మోదీ పర్యటిస్తారు.