Paper Cups | పేపర్ కప్పులో వేడి టీ, కాఫీ తాగుతున్నారా? ఈ ప్రమాదం గురించి తప్పక తెలుసుకోండి!
Paper Cup | సింగిల్ యూజ్ పేపర్ కప్పుల్లో కాఫీ, టీలాంటి వేడి ద్రవాలు పోసినప్పుడు లక్షలాది మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ అధ్యయనం వెల్లడించింది.
Paper Cups |బ్రిస్బేన్: సింగిల్ యూజ్ పేపర్ కప్పుల్లో కాఫీ, టీలాంటి వేడి ద్రవాలు పోసినప్పుడు లక్షలాది మైక్రోప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ అధ్యయనం వెల్లడించింది. విశ్వవిద్యాలయానికి చెందిన ‘క్వీన్స్లాండ్ అలయన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్’ బృందం శిలాజ ఆధారిత పాలిథిన్(పీఈ) పూత పూసిన కప్పులు, అలాగే పాలీలాక్టిక్ యాసిడ్(పీఎల్ఏ) పూత పూసిన కప్పులపై అధ్యయనం చేసింది.
ఈ రెండు రకాల కప్పులు ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తున్నట్లు తేలిందని, అయితే పీఎల్ఏ లేదా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పూత కలిగిన కప్పులు 12 రెట్లు ఎక్కువ కణాలను విడుదల చేశాయని డాక్టర్ ఎల్విస్ ఒకోఫో తెలిపారు. కప్పు కాగితంతో తయారైనంత మాత్రాన అది ప్లాస్టిక్ రహితమని అర్థం కాదు. ఎందుకంటే నీటి నిరోధకతను, నిర్మాణ స్థిరత్వాన్ని అందిండానికి చాలా కప్పుల్లో సన్నని ప్లాస్టిక్ పూత ఉంటుందని అన్నారు. దీని అర్థం పేపర్ కప్పుల వాడకాన్ని ఆపేయాలని కాదని, వాటి లోపలి పూతకు ఉపయోగించే పదార్థాల గురించి వినియోగదారులకు సమాచారం అందించాలనేదే తమ ఉద్దేశమని డాక్టర్ ఒకోఫో అన్నారు. ఈ అధ్యయనం ‘ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

