అబుదాబీ: ఎండలతో భగభగలాడే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అనేక ప్రాంతాలను భారీ వర్షాలు అల్లాడిస్తున్నాయి. దుబాయ్, అబుదాబితో పాటు అనేక నగరాలను గురు, శుక్రవారాల్లో భారీ వానలు ముంచెత్తడంతో కొన్ని గంటల పాటు జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శుక్రవారం పలు విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో ఆలస్యంగా నడిచాయి. దుబాయ్, అబుదాబీల్లో అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. దోహా, ఖతార్లలో భారీ వానలతో పరిస్థితి అధ్వానంగా మారింది.