హైదరాబాద్: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్నది. బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో (Kyiv) ప్రవేశించాయి. అయితే ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటించడంతో క్షిపణి దాడులకు పాల్పడుతున్నది. దీంతో కీవ్ దక్షిణ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిళ్లుతున్నది. ఇరు దేశాల సైన్యాల మధ్య భీకర పోరు జరుగుతుండంతో ఆ ప్రాంతంలో భారీగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. కాగా, ప్యారా ట్రూపర్స్ సాయంతో రష్యా విమానాన్ని పేల్చేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
More video from Kyiv, where heavy fighting is happening now – NEXTA pic.twitter.com/NTaLekLlGj
— BNO News (@BNONews) February 26, 2022
WATCH: Heavy fighting in Kyiv pic.twitter.com/j5a9dnmXpD
— BNO News (@BNONews) February 26, 2022
సైనిక చర్య అని చెప్పి ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడిన రష్యా మరింతగా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి పరిమితమైన రష్యా బలగాలు శుక్రవారం రాజధాని కీవ్‌లోకి ప్రవేశించాయి. జనావాసాల్లో యుద్ధ ట్యాంకులు స్వైర విహారం చేశాయి. సైనికుల పరేడ్, యుద్ధ విమానాల విన్యాసాలతో నగరమంతా రణభూమిని తలపించింది. ప
WATCH: Fighting underway in Kyiv, with battles also being reported south of the city pic.twitter.com/u0ZSmGjJvB
— BNO News (@BNONews) February 26, 2022
లు ప్రాంతాల్లో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొన్న ప్రజలు మెట్రో అండర్‌గ్రౌండ్ పాస్, సబ్వే, బంకర్లలో తలదాచుకొన్నారు. నగరం బయట ఉన్న వ్యూహాత్మకమైన ఎయిర్‌పోర్ట్‌ను తమ అధీనంలోకి తీసుకున్నట్టు రష్యా ప్రకటించింది. రష్యా దురాక్రమణను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాన నగరాల్లోకి శత్రువులు ప్రవేశించకుండా వంతెనలను పేల్చేస్తున్నాయి.