లండన్ : గుండెపోటును కచ్చితత్వంతో నిర్ధారించగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్‌ను ఎడిన్బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
తమ అల్గారిథం ద్వారా గుండెపోటు బాధితుల పరిస్థితి విషమించకుండా చూడొచ్చని, వేగంగా వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 99.6 శాతం కచ్చితత్వంతో గుండెపోటును గుర్తించవచ్చని పేర్కొన్నారు.