హనోయ్, జూన్ 23: చూడటానికి ఏదో ఫిక్షన్ సినిమాలోని టైమ్ మిషిన్‌లా కనిపిస్తున్న ఈ పరికరం.. ఒక వాహనం. వియత్నాంకు చెందిన ట్రుయాంగ్ వాన్ డావ్ అనే యువకుడు కలపతో దీనిని తయారుచేశాడు.
కలపను ఉపయోగించి లగ్జరీ కార్లను పోలిన చిన్న కార్లను తయారుచేయడం ఇతడికి వ్యాపకం. సొంత డిజైన్‌తో తన కుమారుడి కోసం ఒక కారు తయారు చేయాలనుకున్నాడు. ఏఐను ఉపయోగించి ఒక కారు డిజైన్‌ను సృష్టించుకున్నాడు. కలపతో ఆ డిజైన్‌కు తగ్గట్టుగా వాహనం తయారుచేశాడు. బ్యాటరీతో నడిచే ఈ వాహనం ఇప్పుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.