Eli Sharabi : ఎలీ శరబి (Eli Sharabi)..! 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ (Israel) పై హమాస్ రెబల్స్ (Hamas Rebels) దాడిచేసి బందీలుగా తీసుకెళ్లిన వారిలో శరబి కూడా ఒకరు. మొత్తం 491 రోజులు ఆయన హమాస్ రెబల్స్ చెరలో బంధీగా ఉన్నాడు. శనివారం హమాస్ చెర వీడిన ఆయన చాలాకాలం తర్వాత తన భార్యాబిడ్డలను చూడబోతున్నానన్న ఆనందంతో ఇంటికి వచ్చాడు. కానీ తాను హమాస్ రెబల్స్‌కు బంధీగా చిక్కన నాడే తన భార్యబిడ్డలు హత్యకు గురయ్యారని తెలిసి కుప్పకూలాడు.
గుండెను పిండేసే ఈ హృదయ విధాకర సందర్భం గురించి వివరాల్లోకి వెళ్తే.. 2023 అక్టోబర్ 7న హమాస్ రెబల్స్ శరబిని బంధీగా తీసుకెళ్లిన నాడే ఆయన భార్యాబిడ్డలు దారుణ హత్యకు గురయ్యారు. నాడు హమాస్ రెబల్స్ జరిపిన దాడిలోనే శరబి భార్య లియాన్ (Leanne), కుమార్తెలు 16 ఏళ్ల నోయా (Noya), 13 ఏళ్ల యహెల్ (Yahel) ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ విషయం శరబికి తెలియదు. అప్పటి నుంచి 2025 ఫిబ్రవరి 8 వరకు ఆయన హమాస్ బంధీగానే ఉన్నాడు. కుటుంబం మీద బెంగతో తిండి సరిగా తినక పూర్తిగా బక్కచిక్కిపోయాడు.
అయితే హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ తన దగ్గరున్న యుద్ధ ఖైదీలను విడిచిపెట్టగా.. హమాస్ కూడా తన వద్ద బంధీలుగా ఉన్నా ఇజ్రాయెలీలను విడిచిపెడుతోంది. ఈ క్రమంలో శనివారం ఎలీ శరబితోపాటు మరో ఇద్దరు ఇజ్రాయెలీ బంధీలను హమాస్ వదిలేసింది. విడిచిపెట్టే ముందు శరబి సోదరుడి మరణం గురించి హమాస్ అతడికి తెలియజేసింది. ఆ విషయం తెలిసి విలపించిన శరబి.. తర్వాత తేరుకుని ఇజ్రాయెల్‌కు బయలుదేరాడు.
చాలాకాలం తర్వాత తన భార్యాబిడ్డలను చూడబోతున్నానన్న ఆనందంతో ఆయన ఇంటికి చేరుకున్నాడు. కానీ అక్కడ తన భార్యాబిడ్డలు కనిపించలేదు. శరబి విడుదలకు తీవ్రంగా కృషి చేసిన అతని మరో సోదరుడు ఎలీ శరాన్ మాత్రమే అక్కడ ఉన్నాడు. దాంతో తన భార్యాబిడ్డల గురించి శరబి తన సోదరుడిని ఆరా తీశాడు. నాటి హమాస్ దాడిలోనే వారంతా హత్యకు గురయ్యారని సోదరుడు చెప్పడంతో శరబి గుండె పగిలిపోయింది. అతను నిలబడిన చోటే కుప్పకూలి గుండెలవిసేలా రోధించాడు.
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్లు, 31 మంది మావోయిస్టులు మృతి
Congress | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు సింగిల్ డిజిట్ కూడా రాదు : కాంగ్రెస్
Resign | ఢిల్లీ సీఎం పదవికి అతిషి సింగ్ రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Hyderabad | ఓఆర్ఆర్పై రెచ్చిపోయిన యువకులు.. కార్లను గింగిరాలు తిప్పుతూ రేసింగ్‌లు