గురువారం 28 మే 2020
International - May 09, 2020 , 17:05:09

విదేశీ డాక్టర్లకు అమెరికా గ్రీన్‌కార్డులు

విదేశీ డాక్టర్లకు అమెరికా గ్రీన్‌కార్డులు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారితో ఘోరంగా దెబ్బతిన్న అమెరికా.. తమ ప్రజల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం విదేశీ డాక్టర్లు, నర్సులకు గ్రీన్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. కొవిడ్‌-19 కారణంగా వేలాదిగా ప్రజలు దవాఖానల్లో చేరి చికిత్స పొందుతుండటంతో వైద్యులు, వైద్యసిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. దాంతో విదేశాల్లోని వైద్యులు, నర్సులను తీసుకురావాలని నిర్ణయించి ఇప్పటివరకు వినియోగించని దాదాపు 40 వేల గ్రీన్‌కార్డులను వీరికి అందించాలని నిర్ణయించారు. దీనికి అమెరికన్‌ చట్టసభ సభ్యులు కాంగ్రెస్‌లో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. కరోనా వ్యాధిగ్రస్థులకు సేవలందించేందుకుగాను 25వేల మంది నర్సులు, 15 వేల మంది వైద్యులకు గ్రీన్‌కార్డులు పంపనున్నారు. దాంతో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్యులు, నర్సులను విదేశాల నుంచి రప్పించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు తీర్మానించారు. ఇప్పటికే అమెరికాలో 12,84,000 మంది కొవిడ్‌-19కు గురవగా.. దాదాపు 77 వేల మంది మరణించారు. 


logo