న్యూయార్క్ : ఇంటర్నెట్లో కొన్ని విలువైన వీడియోలను అసలు మిస్ కాలేము. అలాంటి క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో (viral video) ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 100 ఏండ్ల తాత పియానోను శ్రావ్యంగా ప్లే చేస్తున్న వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సంగీతం మనసును ఎలా ఆహ్లాదపరిచి తేలికపరుస్తుందనేందుకు ఈ వీడియో సరైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ వైరల్ క్లిప్‌ను గుడ్ న్యూస్ కరస్పాండెంట్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో పియానోపై వందేండ్ల తాత పెప్పీ ట్రాక్‌ను ప్లే చేయడం కనిపిస్తుంది. క్లిప్ పూర్తయ్యేవరకూ పెద్దాయన ఇనుస్ట్రుమెంట్ను రాగయుక్తంగా ప్లే చేసిన తీరు ఆకట్టుకుంటుంది. తాత మళ్లీ కీస్ ముందుకొచ్చాడు! అసలు ఆయనను ఎవరూ ఆపలేరని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
"Grampapa’s back on the keys! Well, he never stopped…" 🎼🎶👴🏼🎹
(🎥:theoilyshoppe)
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) March 28, 2023
ఈ వీడియోకు 34,000కుపైగా వ్యూస్ లభించాయి. తాత నైపుణ్యాలపై కామెంట్స్ సెక్షన్లో యూజర్లు ప్రశంసలు గుప్పించారు. వీడియో అద్భుతం ఆపై స్ఫూర్తి రేకెత్తించేలా ఉందని ఓ యూజర్ కామెంట్ చేయగా, వావ్..తాత మీకు థ్యాంక్స్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు. ఫెంటాస్టిక్ అంటూ మరో యూజర్ తాత స్కిల్స్‌ను కొనియాడారు.
Read More