హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పేషీ అంటే అది ఒక పవర్ ఫుల్ అడ్డా. అకడ పనిచేసే అధికారులు, సిబ్బంది తాము డిప్యూటీ సీఎం వద్ద పనిచేస్తున్నామనే భావనలో ఉంటారు. కానీ, తాజాగా వచ్చిన కొత్త సంవత్సరం కానుకలు మాత్రం వారి మధ్య చిచ్చుపెట్టాయి. ఈ వ్యవహారం చూస్తుంటే ‘పని మాది.. ఫలం వేరొకరిదా?’ అన్నట్టుగా ఉందట. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గిఫ్టుల సందడి మామూలే. భట్టి గారి పేషీలో కూడా బాక్సులు వచ్చాయి. అయితే, అవి అందరికీ అందలేదు. కొందరికి మాత్రమే ఆ గిఫ్ట్ ప్యాకెట్లు అందడంతో, అందని వారు ‘మేము ఇకడ ఈగలు తోలుకుంటున్నా మా? మేము పనిచేస్తలేమా?’ అని లోలోపల రగిలిపోతున్నారట. గిఫ్ట్ పొందిన వారు చిరునవ్వులు చిందిస్తుంటే, దక్కనివారు ‘లిస్టు రాసినోడు ఎవడు?’ అని ఆరా తీస్తున్నారట.
రిచ్ లుక్.. గిఫ్ట్ ఛీప్
న్యూఇయర్ కానుకలు అందుకున్న వారిలో కూడా అందరూ హ్యాపీగా లేరట. ప్యాక్ చూస్తే రిచ్ లుక్.. విప్పి చూస్తే.. చీప్ గిఫ్ట్ అన్న వ్యవహారం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ‘ఏంటిది? మన సారు డిప్యూటీ సీఎం.. కానుక ఏమో చిల్లర దుకాణం లెవల్లో ఉంది’ అని పెదవి విరుస్తున్నారట. నాసిరకం పెన్ను, నోట్స్.. అవి చూస్తే పకింటి పెళ్లిలో ఇచ్చిన తాంబూలం ప్యాకెట్లకు తకువ కాకుండా ఉన్నాయని కొందరు మేధావులు సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ఈ గొడవ ఇప్పుడే మొదలైంది కాదు. కిందటి దసరా పండుగప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయిందట. అప్పుడు కూడా ‘సగం మందికి స్వీట్లు.. సగం మందికి పాట్లు అన్నట్టుగా వ్యవహారం నడిచిందట. అప్పుడు పోయిందనుకుంటే, ఇప్పుడు కొత్త సంవత్సరానికి కూడా అదే అలకల పర్వం కొనసాగుతున్నదని పేషీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.