Rain Fall | సిడ్నీ, జూలై 28: అయితే అతివృష్టి.. లేకపోతే అనావృష్టి. ఇప్పుడు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న వాతావరణ సవాల్ ఇది. అయితే, ఈ పరిస్థితికి కారణం మనుషులేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవ చర్యల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్లే వర్షపాతంలో అస్థిరత్వం ఏర్పడుతున్నదని చైనా, యూకేకు చెందిన పరిశోధకులు తేల్చారు.
ఆస్ట్రేలియా, ఐరోపాతో పాటు తూర్పు, ఉత్తర అమెరికాలో గత వందేండ్ల వర్షపాతాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు. ఈ వివరాలు ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 1900ల నుంచి వర్షపాతంలో అస్థిరత్వం పెరుగుతున్నదని, 1950 నుంచి ఇది మరింత ఎక్కువయ్యిందని పరిశోధకులు తెలిపారు. సగటున ప్రపంచవ్యాప్తంగా ఒక దశాబ్దంలో 1.2 శాతం మేర వర్షపాతంలో అస్థిరత్వం పెరుగుతున్నట్టు చెప్పారు.