వాషింగ్టన్ : హమాస్ ఉగ్రవాద సంస్థ, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గాజాలో ప్రజలు ఆకలితో అల్లాడిపోతుండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హమాస్ 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిపిన దాడికి ఇజ్రాయెల్ స్పందిస్తున్న తీరును నరమేధంగా భావిస్తున్నారా? అని విలేకర్లు అడిగినపుడు ట్రంప్ స్పందిస్తూ, ఇది నరమేధం అని తాను అనుకోవడం లేదని, హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నది యుద్ధమేనని తెలిపారు.
హమాస్ దుందుడుకు చర్యకు పాల్పడటం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. గాజాలో సామాన్యులు అల్లాడిపోతున్నారని, వారి కడుపు నింపాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. దీని కోసం నిధులు కేటాయిస్తామన్నారు.