కీవ్: ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు చేయూతనిస్తున్నాయి. రష్యా దాడితో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్ ఆయుధాలను అందజేస్తోంది. ఆయుధాలతో పాటు సామాగ్రిని కూడా ఫ్రాన్స్ తరలిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్‌తో సంప్రదింపులు జరిపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కొత్త తరహా దౌత్య రాజకీయం మొదలైనట్లు ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. యుద్ధానికి సన్నద్దం కావాలని మాక్రన్ కూడా ఓ వీడియోను పోస్టు చేశారు. కీవ్ మేయర్ విటాలీ క్లిచ్కోవ్ ఇవాళ ఓ సమాచారాన్ని షేర్ చేశారు. ఆ నగరంలో జరుగుతున్న పోరులో 35 మంది గాయపడినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం కీవ్‌లో రష్యా దళాలు ఏమీ లేవన్నారు.