Pakistan Soldiers | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని రెండు చెక్పోస్టులపై తాలిబన్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని కలాష్ జిల్లాలోగల ఛిత్రల్ప్రాంతంలో ఉన్న రెండు పాకిస్థాన్ సైనిక స్థావరాలపై తాలిబన్లు దాడి చేసినట్లు ఇంటర్ సర్వీసెస్ తెలిపింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో నలుగురు పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. మరో ఏడుగురు గాయపడినట్లు వెల్లడించింది.
Also Read..
G20 Summit | జీ20 సమ్మిట్ వేళ.. ఢిల్లీలో బైడెన్, సునాక్, ట్రూడోస్ బస ఎక్కడంటే..?
Russia – Ukraine | ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. 17 మంది మృతి
Covid 19 Treatment | కరోనా ట్రీట్మెంట్తో నీలిరంగులోకి మారిన 6 నెలల పసికందు కళ్లు