Covid 19 Treatment | కరోనా ట్రీట్మెంట్తో నీలిరంగులోకి మారిన 6 నెలల పసికందు కళ్లు
Covid 19 Treatment | కరోనా వైరస్‌కు చికిత్స (Covid 19 Treatment) తీసుకున్న ఓ పసికందు కళ్లు (Eyes) అసాధారణ రీతిలో ముదురు నీలి రంగులోకి మారాయి. ఈ ఘటన థాయ్‌లాండ్ (Thailand)లో వెలుగులోకి వచ్చింది.
Covid 19 Treatment | కరోనా వైరస్‌కు చికిత్స (Covid 19 Treatment) తీసుకున్న ఓ పసికందు కళ్లు (Eyes) అసాధారణ రీతిలో ముదురు నీలి రంగులోకి మారాయి. ఈ ఘటన థాయ్‌లాండ్ (Thailand)లో వెలుగులోకి వచ్చింది. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ ప్రకారం..
ఆరు నెలల పసికందుకు జ్వరం, దగ్గు రావడంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. దీంతో ఆ చిన్నారికి కొవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పసికందుకు మూడు రోజుల పాటు ఫెవిపిరావిర్తో (Favipiravir Medicine) చికిత్స అందించారు. ఆ ఔషధం వాడిన తర్వాత చిన్నారి ఆరోగ్యం మెరుగైంది. అయితే, ఆ మందు వాడిన 18 గంటల తర్వాత చిన్నారి కళ్ల రంగులో మార్పు కనిపించింది. చిన్నారి కళ్లు ముదురు గోధుమ రంగు నుంచి ప్రకాశవంతమైన నీలి రంగులోకి మారాయి. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఫెవిపిరావిర్ మందు వినియోగం తక్షణమే నిలిపివేయమని సూచించారు. ఆ తర్వాత ఐదు రోజులకు పసికందు కళ్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
‘కళ్లు మినహా చర్మం, గోళ్లు, నోరు, ముక్కు వంటి ప్రాంతాల్లో ఎటువంటి రంగు మార్పు కనిపించలేదు. ఫెవిపిరావిర్ వినియోగం మొదలెట్టిన మూడో రోజుకు శిశువు ఆరోగ్యం మెరుగుపడింది. అయితే, కళ్ల రంగు మార్పు కారణంగా ఆ మందు వాడొద్దని వైద్యులు సూచించారు. మందు నిలిపివేసిన ఐదో రోజుకు కళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి’ అని జర్నల్‌లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కాగా, చిన్నారులకు కొవిడ్ ట్రీట్మెంట్గా ఫెవిపిరావిర్‌ను థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం 2022లో అనుమతించింది. ఓ మోస్తరు వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు వాడాలని సూచించింది.
Also Read..
Indias Name Change Row | ఇండియా పేరు మార్పుపై స్పందించిన ఐక్యరాజ్య సమితి.. ఏమందంటే..?
Shahrukh khan | నువ్వు సినిమా ఎప్పుడూ చూస్తావో చెప్పు.. నేనూ వస్తానన్న బాలీవుడ్ బాద్షా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

