Shahrukh khan | నువ్వు సినిమా ఎప్పుడూ చూస్తావో చెప్పు.. నేనూ వస్తానన్న బాలీవుడ్ బాద్షా
ఒక సూపర్‌స్టార్ సినిమా విడుదలవుతుంటే మరో సూపర్‌స్టార్ శుభాకాంక్షలు తెలుపడం.. ఆ శుభాకాంక్షలు స్వీకరిస్తూ సదరు సూపర్‌స్టార్ ధన్యవాదాలు తెలియపరచడం, నిజంగా అభిమానులకిది ఆనందాన్ని కలిగించే అంశమే.
ఒక సూపర్‌స్టార్ సినిమా విడుదలవుతుంటే మరో సూపర్‌స్టార్ శుభాకాంక్షలు తెలుపడం.. ఆ శుభాకాంక్షలు స్వీకరిస్తూ సదరు సూపర్‌స్టార్ ధన్యవాదాలు తెలియపరచడం, నిజంగా అభిమానులకిది ఆనందాన్ని కలిగించే అంశమే. కోట్లాదిగా ఉండే షారుఖ్‌ఖాన్, మహేశ్‌బాబు అభిమానులు ప్రస్తుతం ఆ హ్యాపీమూడ్ను ఎంజాయ్ చేస్తున్నారు. షారుఖ్ ‘జవాన్’ సినిమాకు మహేశ్‌బాబు తన ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడాలనుకుంటున్నట్లు ఆయన ట్వీట్‌తో తెలియజేశారు.
సినిమా బ్లాక్బాస్టర్ హిట్‌గా నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌కు వెంటనే షారుఖ్ రీట్వీట్ చేశారు. ‘థ్యాంక్యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్.. నువ్వెప్పుడు సినిమా చూడాలనుకుంటున్నావో చెబితే, నేనూ నీతో సినిమాకొస్తా. మీకు ‘జవాన్’ నచ్చుతుందని నా నమ్మకం. మీ కుటుంబానికి నా శుభాభినందనలు” అని ట్వీట్ చేశారు షారుఖ్. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. బయటకూడా షారుఖ్, మహేష్ ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

