బీజింగ్: న్యూజిలాండ్‌కు చెందిన నలుగురు చట్టసభ ప్రతినిధుల(New Zealand Lawmakers)పై చైనా నిషేధం విధించింది. ఓ ఏడాదిపై చైనాలో పర్యటించకుండా ఆంక్షలు విధించింది. తైవాన్‌కు పార్లమెంటరీ ట్రిప్ వేసిన కివీస్ ప్రతినిధులు క్షమాపణలు చెప్పాలని చైనా డిమాండ్ చేసింది. తొలిసారి కివీస్ చట్టసభ ప్రతినిధులతపై చైనా నిషేధం విధించిందని వెల్లింగ్టన్లోని ప్రభుత్వ అధికారి తెలిపారు. తైవాన్ అంశంలో ఇటీవల చైనా ఆంక్షలను బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజింగ్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను న్యూజిలాండ్ విస్మరించినట్లు చైనా పేర్కొన్నది.
ముందస్తు వార్నింగ్‌లు ఇచ్చినా కివీస్ ప్రతినిధులు తైవాన్ వెళ్లినట్లు చైనా వెల్లడించింది. వెల్లింగ్టన్లో ఉన్న చైనా ఎంబసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కివీస్ ప్రతినిధులు తైవాన్‌లోని ఉన్నత స్థాయి రాజకీయవేత్తలతో భేటీ అయ్యారని, ఇది రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నదని, ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుందని చైనా ఎంబసీ పేర్కొన్నది. ఏ దేశ పార్లమెంట్ సభ్యులు ఎవరైనా తైవాన్‌కు వెళ్లడాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా తెలిపింది. తైవాన్ అంశంలో రెడ్‌లైన్ దాటిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చైనా ఎంబసీ తన స్టేట్మెంట్లో తెలిపింది.