లండన్: బ్రిటన్‌లోని యూద వర్గీయుల(Jewish Community)పై దాడి జరుగుతోంది. యూద కమ్యూనిటీకి చెందిన నాలుగు అంబులెన్స్‌ను లండన్‌లో ధ్వంసం చేశారు. యూదులకు వ్యతిరేకంగా హింస, విద్వేష దాడి జరుగుతున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు. గోల్డర్స్ గ్రీన్‌లో ఉన్న హైఫీల్డ్ రోడ్లో ఈ ఘటన జరిగింది. లండన్ అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసింది. యూద వర్గానికి చెందిన అంబులెన్స్ సర్వీసులపై దాడి జరగడం పట్ల దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ వాహనాల్లో ఉన్న సిలిండర్లు పేలినట్లు గుర్తించారు. పేలుడు ధాటికి సమీప ఫ్లాట్లకు ఉన్న కిటికీలు కూడా ధ్వంసం అయ్యాయి.
మంటల్ని ఆర్పేందుకు ఆరు ఫైర్ ఇంజిన్లు, 40 మంది ఫైర్‌ఫైటర్లు రంగంలోకి దిగారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రస్తుతం మంటల్ని ఆర్పేశారు. ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు. హట్జోలా ఎన్జీవోకు చెందిన అంబులెన్సులకు నిప్పుపెట్టారు. ఆస్పత్రికి వెళ్లేవారికి ఉచితంగా ఆ సంస్థ అంబులెన్స్ సేవల్ని అందిస్తుంది. హట్జోలా స్వచ్ఛంధ సంస్థకు చెందిన అంబులెన్సులపై ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పోస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్కు చిక్కాయి. గోల్డర్స్ గ్రీన్ వద్ద ఉన్న యూద ఆలయం సమీపంలో అంబులెన్సులను పార్క్‌చేశారు. నిప్పు పెట్టడం వల్ల అంబులెన్సుల్లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌లు పేలినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నది.
ప్రధాని స్టార్మర్ ఈ ఘటనను ఖండించారు.
🚨 BREAKING: Major antisemitic arson attack in Golders Green, London destroys all ambulances (at least 4) of Hatzola Northwest — a volunteer Jewish emergency service providing 24/7 medical aid. @Breaking911 has seen footage of the attackers. pic.twitter.com/GwCWXG38qB
— Breaking911 (@Breaking911) March 23, 2026