బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 17, 2020 , 22:53:14

1997 లో ట్రంప్ లైంగికంగా వేధించాడు : మాజీ మోడల్

1997 లో ట్రంప్ లైంగికంగా వేధించాడు : మాజీ మోడల్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1997 లో తనను లైంగికంగా వేధించారని మాజీ మోడల్ ఒకరు ఆరోపించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్ తిరిగి బరిలో నిలిచిన అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు తాజాగా ఆరోపణలు వచ్చాయి. న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ జరుగుతుండగా ట్రంప్ తన వీఐపీ సూట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మాజీ మోడల్ అమీ డోరిస్ చెప్పారు.

"అతడు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని చూశాడు. తన నాలుకను నా గొంతు క్రిందకు కదిలించే ప్రయత్నం చేయగా నేను అతనిని నెట్టివేశాను. ఆపై అతడి పట్టు గట్టిగా మారింది. అతడు తన చేతులతో నా శరీరంపై ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు. నేను ఆయన పట్టులో ఉండిపోయి బయటపడలేకపోయాను" అని డోరిస్ ఒక పత్రికకు ఇచ్చని ఇంటర్వ్యూలో వెల్లడించింది.

డొనాల్డ్ ట్రంప్ లైంగిక దుష్ప్రవర్తనపై ఇప్పటివరకు డజనుకు పైగా ఆరోపణలను ఎదుర్కొన్నాడు. 1990 మధ్యలో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ లోని గదిలో ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్ ఈ జీన్ కారోల్ పై కూడా లైంగికదాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం కోసం వాటన్నింటినీ పక్కన పెట్టేశాడు. 2016 ఎన్నికలకు కొంతకాలం ముందు బయటపడిన టేప్ రికార్డింగ్ లో కూడా ట్రంప్ లైంగికదాడికి సంబంధించిన ట్రంప్ ప్రగల్భాలు ఉన్నాయి. ట్రంప్ దీనిని "లాకర్ రూమ్ బాంటర్" అని కొట్టిపారేశారు. కానీ తరువాత క్షమాపణలు చెప్పారు. 

ఈ విషయంపై ట్రంప్ న్యాయవాదులు వార్తాపత్రికతో మాట్లాడుతూ.. మాజీ మోడల్ చేసిన ఆరోపణలు నమ్మదగినవి కావని, ఆమెపై దాడి జరిగితే సాక్షులు కూడా ఉండాలి కదా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ట్రంప్ ను బలహీనపరిచేందుకే ఇలాంటి ఆరోపణలు చేయిస్తూ ఆమెను రాజకీయంగా ప్రేరేపించవచ్చునని వారు కొట్టిపారేశారు.

మొదట తన కథను ఏడాది క్రితం ఒక వార్తాపత్రికకు చెప్పిన అమీ డోరిస్ .. అనంతరం దానిని ప్రచురించవద్దని కూడా సదరు వార్తాపత్రికను కోరింది.


logo