Parineeti Chopra | పరిణితీ చోప్రా అమ్మకూచి. ఆమెకు తన తల్లి రీనా చోప్రా అంటే ఆపారమైన ప్రేమ. వారిద్దరి అనుబంధం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘అమ్మ నాకు మంచి ఫ్రెండ్. నాపై ఆమె చూపిస్తున్న ప్రేమను జీవితంలో మరిచిపోలేను. తనకెప్పుడూ రుణపడే ఉంటాను. మా అమ్మది చిన్నపిల్ల మనస్తత్వం. ఇప్పటికీ నేనే చాలా నేర్పుతుంటాను.
కొన్ని సందర్భాల్లో నేను తల్లిగా, ఆమె కూతురిగా మారిపోతుంటాం. నాకు స్కూబా డైవింగ్ బాగా వచ్చు. అమ్మక్కూడా నేర్పించా. తను కూడా ఇప్పుడు బాగా స్కూబా ఆడుతుంది. అంతేకాదు, భౌతికంగా ఇద్దరం దూరంగా ఉన్నా. ఆన్లైన్లో కలిసే ఉంటాం. దూరంగా ఉండి కూడా గేమ్స్ ఆడుకుంటాం. ఈ నెల 12న మదర్స్ డే. ఆ రోజున అమ్మకు గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అదేంటో ఇప్పుడే చెప్పను.. సస్పెన్స్’ అని చెప్పుకొచ్చింది పరిణితి చోప్రా.