డిగ్రీలో చేరాలంటే ‘దోస్త్’ కట్టాల్సిందే..
రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సులో చేరాలంటే ‘దోస్త్' కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల పారదర్శకత కోసం 2016 నుంచి రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)ను అందుబాటులోకి తెచ్చింది.
- నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి
- నేటి నుంచి ఆన్లైన్లో అడ్మిషన్లు.. ఈ నెల 25 వరకు తొలి విడుత గడువు
- అందుబాటులో దోస్త్ వెబ్ సైట్, దోస్త్ మొబైల్ యాప్
- మూడు విడుతల్లో అడ్మిషన్ల ప్రవేశాల ప్రక్రియ
- జూలై 7తో అడ్మిషన్లు పూర్తి.. 8 నుంచి తరగతులు షురూ
- ఎంజీయూ పరిధిలో 83 కళాశాలలు.. 30వేల అడ్మిషన్లు
రామగిరి, మే 5 : రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సులో చేరాలంటే ‘దోస్త్’ కట్టాల్సిందే. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల పారదర్శకత కోసం 2016 నుంచి రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)ను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి 2024-25 సంవత్సరానికి నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రంలో నచ్చిన యూనివర్సిటీ పరిధిలో కళాశాలలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందేందుకు చక్కటి దిక్సూచి ‘దోస్త్’. తొలి విడుత అడ్మిషన్లకు ఈ నెల 6నుంచి ఈ నెల 25 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. మూడు విడుతల్లో జరిగే అడ్మిషన్ల ప్రక్రియ జూలై 7తో ముగియనుంది.
ఆ వెంటనే తొలి సెమిస్టర్ తరగతులు జూలై 8 నుంచి ప్రారంభమవుతాయి. విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్‌తోపాటు దోస్ మొబైల్ యాప్‌లో కూడా ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 83 కళాశాలల్లో 30వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది 53 శాతం సీట్లు మాత్రమే నిండాయి. దోస్త్‌పై సందేహాలు, సూచనలకు ఎంజీయూతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుతోపాటు తత్సమాన కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు డిగ్రీ ఆయా కోర్సులో చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకోండిలా…
దోస్త్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్‌తో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. విద్యార్థులు తమ ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. http://dost.cgg.gov.in వెబ్సైట్లోగానీ DOST మొబైల్ యాప్‌లోగానీ లాగిన్ కాగానే దోస్త్ ఐడీ, పిన్ నంబర్ వస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు విద్యార్థులు రూ. 200 క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. వీటిని ఉపయోగించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఓపెన్ అయిన సైట్లో యూనివర్సిటీ, కళాశాలల వారీగా ప్రాధాన్యత క్రమంలో కోర్సుల ఎంపిక, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సిలింగ్లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంచుకున్న కళాశాలకు వెళ్లి అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు చూపించాలి. వారు అక్కడ అడిగిన సర్టిఫికెట్స్‌ను అందజేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కళాశాలల ఎంపిక ఇలా..
విద్యార్థి ఏ కళాశాలలో, ఏ గ్రూప్‌లో చేరదల్చుకున్నాడో వాటిని ప్రాధాన్యత ప్రకారం ఎంపిక చేసుకోవాలి. ఎన్ని కళాశాలల్లో ఆ విద్యార్థికి సంబంధించిన కోర్సు ఉంటుందో వాటిని నమోదు చేసుకోవాలి. కళాళాలలు, గ్రూప్స్ ఎంపిక పూర్తి కాగానే సేవ్ బటన్ నొక్కితే వెంటనే సేవ్ అయిపోతుంది. అప్పుడు ఏ కళాశాలల్లో దరఖాస్తు చేసుకున్నామో అందుకు సంబంధించిన పత్రాలు జనరేట్ అవుతాయి. వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లకు ఫేజ్ -1 ఈ నెల 6 నుంచి 25 వరకు అవకాశం
- ఈ నెల 15 నుంచి 27 వరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్
- జూన్ 3న వెబ్ ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులకు తొలి విడుత సీటు అలాట్మెంట్
- జూన్ 4 నుంచి 10 వరకు అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో (కళాశాల ఫీజు, సీటు రిజ్వరేషన్ ఫీజు చెల్లించి) చేరడానికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
- జూన్ 4నుంచి 13 వరకు రూ. 400 చెల్లించి రెండో ఫేస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్
- జూన్ 4 నుంచి 14వరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్
- జూన్ 18న రెండో లిస్టులో సీటు అలాట్మెంట్ వివరాలు విడుదల
- రెండో లిస్టులో సీటు వచ్చిన విద్యార్థులు జూన్ 19 నుంచి 24 వరకు కళాశాలల్లో రిపోర్టు చేయాలి
- జూన్ 19నుంచి 25 వరకు మూడో విడుత రూ. 400 చెల్లించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 19 నుంచి 26వరకు వెబ్ ఆప్షన్స్
- జూన్ 29న ఫైనల్ (మూడో విడుత) సీటు అలాట్మెంట్ విడుదల
- చివరి లిస్టులో సీటు వచ్చిన విద్యార్థులు జూన్ 29 నుంచి జూలై 3వరకు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి.
- ఫేజ్ 1, 2, 3లో సీటు వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీటు నమోదు చేసిన విద్యార్థులు జూన్ 29నుంచి జూలై 5లోగా ఆయా కళాశాలలో చేరడానికి అవకాశం
- జూలై 1 నుంచి 6వరకు డిగ్రీలో చేరిన విద్యార్థులకు ఆయా కళాశాలలో ఓరియంటేషన్ ఉంటుంది.
- జూలై 8నుంచి సెమిస్టర్ -1 తరగతులు మొదలవుతాయి. దోస్త్‌లో డిగ్రీ అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- ఎంజీయూ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలో డిగ్రీలో చేరడానికి నోఫిటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యార్థులంతా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దోస్త్ అడ్మిషన్లలో సందేహాల కోసం ప్రత్యేక హైల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో ఏమైనా తప్పులు జరిగితే వర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చి సవరణ చేసుకునే అవకాశం ఉంది. సందేహాలకు వర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్స్లోగానీ, నా ఫోన్ నంబర్ 99483 61250లోగానీ సంప్రదించవచ్చు.
– ఆకుల రవి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ఎంజీయూ
అడ్మిషన్ల కోసం ఉచిత సేవలు అందిస్తున్నాం
దోస్త్ ద్వారా డిగ్రీలో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ఉచిత సేవలు అందిస్తున్నాం. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల, ఐడియల్ కళాశాలలో హైల్ప్‌లైన్ సెంటర్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, రెండు ఎయిడెడ్ కళాశాలలున్నాయి. వీటిల్లో అన్ని రకాల మౌలిక వసతులతోపాటు నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు.
– సముద్రాల ఉపేందర్, ప్రిన్సిపాల్, ఎన్జీ కళాశాల, నల్లగొండ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

